Ghantasala (1922-1974)

By T.Chalapathi Rao, Music Director, from Andhra Jyoti, 1974

Editors Note: This article is in Unicode; If you cannot see the Telugu script, please scroll down to read the RTS Transcription, or see the pdf version here

సంగీతం చచ్చిపోయింది. తెలుగునాటి వెలుగు కనుమరుగైపోయింది. చలన చిత్ర సంగీత తరంగాలు స్తంభించి పోయినవి. గాలి కూడా నిలిచిపోయింది. నా గుండె నెవరో నొక్కుతున్నట్లైపోయింది. నా నరాలు బిగుసుకు పోతున్నాయి.

మిత్రమా!

నీవు వెళ్ళిపోయావు! మమ్ముల నందరినీ విడిచి వెళ్ళిపోయావు. పోతూ మాలోని చైతన్యాన్ని కూడా తీసికొని పొయ్యావు. మాకేమీ తోచటంలేదు. దారి కనుపించడంలేదు. ఎటు చూసినా చీకటి. ఈ చీకటిలో ఎంతకాలం మంగలం!

నీవున్నంతకాలం, మాలో, మా గుండెల్లో ఏ మూల దాగున్నావో తెలియలేదు. మేము తెలుసుకోటానికి ప్రయత్నంకూడ చెయ్యలేదు! కానీ నీవు అనంతంలో కలిసిపోయిన మరుక్షణంలో ఏర్పడిన ఖాళీ మాకు తెలిసింది. గాలి కూడ నీవులేని చోటికి రావటానికి భయపడుతోంది. బాధ పడుతోంది. ఆ కాళీ ఎలా భర్తీ చెయ్యాలి? ఎలా భర్తీ చెయ్యాలి?

ఘంటసాల: "చలపతిరాఉ బాబూ! ఐపోయింది! మన మిషను (మచినె) చెడిపోయింది. స్పేరు పార్త్స్‌ (స్పరె పర్త్స్‌) కూడా దొరకడం లేదు. వాడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. ఆ భగవాన్‌ శ్రీనివాసు డెప్పుడు కరుణిస్తాడో! రేపే పిలవచ్చు! పది రోజుల్లో పిలవచ్చు!! ఏ మైనా నెల దాట నివ్వను బాబూ!"

చలపతిరాఉ: "నీ మాట నీవు దక్కించుకున్నావు. మమ్ములనందరినీ చీకటిలో వదలి నీవు వెళ్ళిపోయావు. నీవన్న మాటలు మాత్రం నా గుండెల్లో సుడిగుండాల్లా తిరుగుతునే వున్నాయి. మిత్రమా! నీ భౌతిక కాయాన్ని చూడాలని వచ్చాను. నీవు లేని ఆ కట్టెను...నీవుకాని నిన్ను...చూడాలని వచ్చాను. నావల్ల కాలేదు. కళ్ళలో నీళ్ళు తిరిగినయ్‌. నా వళ్ళుకూడ తిరిగింది. ఎవరో నన్ను పట్టుకున్నారు. దూరంగా తీసుకు వెళ్ళారు. నాచేత మాత్రలు మింగించి నిద్రపుచ్చారు.

నిద్రలో ఎన్నో కలలు : కలలన్నీ గతకాలం చిలికించిన మధుర స్మ్రుతులు. సాహిత్యానికి నేను సంతరించిన సంగీతాన్ని నీ నోట పలికించిన తీరులు. ఆ పాటలు అద్భుతంగా వినిపించినపుడు నేను పొందిన అనుభూతులు! కొంత మంది గురుపండితులు మీరనలేని సంగతిని, మీరు పాడలేని సరళిని స్రుష్టించాలని, అది మీరు పాడలేకపోతే చూచి ఆనందించాలని ప్రయత్నించి విఫలులైనవారి విన్నబోయిన వదనాలు! ప్రతిమెట్టూ మీతో పాడించుకుని, పరవశించి కీర్తిశ్రేణి మెట్లు ఒక్కొక్కటిగా అధిరోహించే ఆకాశజీవులు!!!

ఊరూరా ఒక ఘంటసాల! "ఒరే నీ గొంతు ఘంటసాల గొంతులా ఉందిరా!" అంటే నీవు పాడిన ప్రతి పాటా ప్రతి ఊరిలో ఒక ఘంటసాలలో విని, అతనిలో నీ రూపం ప్రతిష్టించుకుని, అతని గొంతులో నీ మాధుర్యం ఊహించుకుని అనుభవించిన, ఆనందించిన మధుర క్షణాలు!!!

బ్రతికున్న వాళ్ళంతా నీ ఆఖరు ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వర్గారోహణలో నీ విప్పటికి చాలా దూరం పయనించి వుంటావని తెలుసు. నీ విప్పుడు "బహుదూరపు బాటసారివి"!

ఐనా నీకిక్కడ ఆఖరి ప్ర్యాణం తలపెట్టారు. నీకు స్నానం చేయించారు. క్రొత్త బట్టలు పెట్టారు. పసుపు కుంకుమలు దిద్దారు. ఇదంతా ఒక త్రుప్తి. ఇంత పెద్ద అసంత్రుప్తిలో - ఇది కూడా ఒక త్రుప్తి. కడసారి శ్రధ్ధాంజలిగా ఎన్నో పూలమాలలు.!

నేనూ నీతోపాటు బయలుదేరాను. నీకు ముందే నడుస్తున్నాను. నీకు కొమ్ము కూడ పట్టాను! కడకంటా నీతో రావాలనే వుంది. బరువంతా మాకు వదలి నీవు గాలిలో తేలి పోయావు. నిన్నెలా చేరుకోను? ఆ బరువును మోస్తూ మద్రాసు వీధుల్లో వూరేగుతున్నం. నీ ఆఖరు ప్రయాణంలో మానవ హ్రుదయాలు ఘోషిస్తూ వున్నాయి. సూర్యుడు మబ్బుచాటున వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. రోడ్డు ప్రక్కన చెట్లన్నీ గలగలా కన్నీరు కారుస్తున్నాయి. మళ్ళీ నా కళ్ళు తిరిగినయ్‌. నా ఒళ్ళు కూడా తిరుగుతున్నట్లుంది.

ఐనా నువ్వు వెళ్ళిపొయ్యావంటే -

ఇక నువ్వు మా ముందు లేవంటే -

ఎలా నమ్మేది?

ఇందరి హ్రుదయాల్లో గోఓడు కట్టుకున్న నువ్వు అన్ని గదులూ ఖాళీచేసి ఒక్కసారి వెళ్ళిపోతే ఎలా???

"ఆ! ఆ!! ఏమంటున్నావ్‌! సంగీతం చచ్చిపోలేదా? మనదేసం ప్రతి ఇంటా, ప్రతి నోటా నీ పాట పలుకుతుఊనే వుంటుందా. నీవు మళ్ళీ తిరిగి వస్తావా? ఏమో! నువ్వు వస్తావో రావో నాకు తెలియదు కాని నేనూ ఒకనాటికి నీ దగ్గరకు వస్తాను. నీవుండే చోట నాకూ కొంత చోటుంచు....."


sangiitam caccipOyindi. teluguna'Ti velugu kanumarugaipOyindi. calana citra sangiita taranga'lu stamBinci pOyinavi. ga'li kooDa' nilicipOyindi. na' gunDe nevarO nokkutunnaTlaipOyindi. na' nara'lu bigusuku pOtunna'yi.

mitrama'!

niivu veLLipOya'vu! mammula nandarinii viDici veLLipOya'vu. pOtoo ma'lOni caitanya'nni kooDa' tiisikoni poyya'vu. ma'kEmii tOcaTamlEdu. da'ri kanupincaDamlEdu. eTu coosina' ciikaTi. ii ciikaTilO entaka'lam mangalam!

niivunnantaka'lam, ma'lO, ma' gunDellO E moola da'gunna'vO teliyalEdu. mEmu telusukOTa'niki prayatnamkooDa ceyyalEdu! ka'nii niivu anantamlO kalisipOyina marukshaNamlO ErpaDina Ka'Lii ma'ku telisindi. ga'li kooDa niivulEni cOTiki ra'vaTa'niki BayapaDutOndi. ba'dha paDutOndi. a' ka'Lii ela' Bartii ceyya'li? ela' Bartii ceyya'li?

GanTasa'la: "calapatira'u ba'boo! aipOyindi! mana mishanu (machine) ceDipOyindi. spEru pa'rts (spare parts) kooDa' dorakaDam lEdu. va'Di pilupu kOsam eduru coostunna'nu. a' Bagava'n Sriiniva'su DeppuDu karuNista'DO! rEpE pilavaccu! padi rOjullO pilavaccu!! E maina' nela da'Ta nivvanu ba'boo!"

calapatira'u: "nii ma'Ta niivu dakkincukunna'vu. mammulanandarinii ciikaTilO vadali niivu veLLipOya'vu. niivanna ma'Talu ma'tram na' gunDellO suDigunDa'lla' tirugutunE vunna'yi. mitrama'! nii Boutika ka'ya'nni cooDa'lani vacca'nu. niivu lEni a' kaTTenu...niivuka'ni ninnu...cooDa'lani vacca'nu. na'valla ka'lEdu. kaLLalO niiLLu tiriginay. na' vaLLukooDa tirigindi. evarO nannu paTTukunna'ru. dooramga' tiisuku veLLa'ru. na'cEta ma'tralu minginci nidrapucca'ru.

nidralO ennO kalalu : kalalannii gataka'lam cilikincina madhura smrutulu. sa'hitya'niki nEnu santarincina sangiita'nni nii nOTa palikincina tiirulu. a' pa'Talu adButamga' vinipincinapuDu nEnu pondina anuBootulu! konta mandi gurupanDitulu miiranalEni sangatini, miiru pa'DalEni saraLini srushTinca'lani, adi miiru pa'DalEkapOtE cooci a'nandinca'lani prayatninci viPalulainava'ri vinnabOyina vadana'lu! pratimeTToo miitO pa'Dincukuni, paravaSimci kiirtiSrENi meTlu okkokkaTiga' adhirOhincE a'ka'Sajiivulu!!!

Uroora' oka GanTasa'la! "orE nii gontu GanTasa'la gontula' undira'!" anTE niivu pa'Dina prati pa'Ta' prati UrilO oka GanTasa'lalO vini, atanilO nii roopam pratishTincukuni, atani gontulO nii ma'dhuryam Uhincukuni anuBavincina, a'nandincina madhura kshaNa'lu!!!

bratikunna va'LLanta' nii a'Karu praya'Na'niki sanna'ha'lu cEstunna'ru. svarga'rOhaNalO nii vippaTiki ca'la' dooram payaninci vunTa'vani telusu. nii vippuDu "bahudoorapu ba'Tasa'rivi"!

aina' niikikkaDa a'Kari prya'Nam talapeTTa'ru. niiku sna'nam cEyinca'ru. krotta baTTalu peTTa'ru. pasupu kumkumalu didda'ru. idanta' oka trupti. inta pedda asamtruptilO - idi kooDa' oka trupti. kaDasa'ri Sradhdha'njaliga' ennO poolama'lalu.!

nEnuu niitOpa'Tu bayaludEra'nu. niiku mundE naDustunna'nu. niiku kommu kooDa paTTa'nu! kaDakanTa' niitO ra'va'lanE vundi. baruvanta' ma'ku vadali niivu ga'lilO tEli pOya'vu. ninnela' cErukOnu? a' baruvunu mOstoo madra'su viidhullO voorEgutunnam. nii a'Karu praya'NamlO ma'nava hrudaya'lu GOshistoo vunna'yi. sooryuDu mabbuca'Tuna vekki vekki EDustunna'Du. rODDu prakkana ceTlannii galagala' kanniiru ka'rustunna'yi. maLLii na' kaLLu tiriginay. na' oLLu kooDa' tirugutunnaTlundi.

aina' nuvvu veLLipoyya'vanTE -

ika nuvvu ma' mundu lEvanTE -

ela' nammEdi?

indari hrudaya'llO gOODu kaTTukunna nuvvu anni gaduloo Ka'LiicEsi okkasa'ri veLLipOtE ela'???

"a'! a'!! EmanTunna'v! sangiitam caccipOlEda'? manadEsam prati inTa', prati nOTa' nii pa'Ta palukutuoonE vunTunda'. niivu maLLii tirigi vasta'va'? EmO! nuvvu vasta'vO ra'vO na'ku teliyadu ka'ni nEnoo okana'Tiki nii daggaraku vasta'nu. niivunDE cOTa na'koo konta cOTuncu....."