gaana gaMdharvuDu ghaMTasaala

P.Susheela

RTS Transcribed by NaChaKi

Editors Note: This article is in Unicode; If you cannot see the Telugu script, please scroll down to read the RTS Transcription, or see the pdf version here

పట్రాయని వారింట రాగరసాధిదేవతను స్వరపారిజాతాలతో అర్చన చేసి, విజయనగరం మహారాజా వారి సంగీత కళాశాలలో సప్తస్వరాల తపస్సు చేసి సానపట్టిన వజ్రమై వెండి తెరకు విచ్చేసిన కళామతల్లి ముద్దుబిడ్డ శ్రీ ఘంటసాల. విద్యల నగరం విజయనగరం. ఆంధ్రదేశానికి అపురూపంగా అందించిన సుస్వర మందారమాల సుమధుర గీతాల హేల శ్రీ ఘంటసాల.

నిజజీవితంలో ఎన్నో ఒడిదుడుకులనెదుర్కొని సంగీత సరస్వతిని ఆరాధించి, చిత్రసీమలో ప్రవేశించడానికి అవకాశాల కోసం ఎంతో శ్రమించారు స్వరగంధర్వహేల శ్రీ ఘంటసాల. అయితే ప్రకాశించే సూర్యుడిని ఎంతో కాలం మబ్బులు దాచి ఉంచలేవు అన్న చందాన వారి ప్రతిభను గుర్తించి, ఆయన గళమాధుర్యానికి తన్మయం చెంది చలనచిత్రరంగం వారికి సాదర స్వాగతం పలికింది.

వారి "గాలిలోనా బ్రతుకు" పాట, "నగుమోమునకు" పద్యం వంటి రసగుళికలు మొట్టమొదటిగా రికార్డు చేసి ఆంధ్రదేసానికి అందించిన ఘనత, కీర్తి హెచ్‌.యమ్‌.వి. (గ్రాంఫోన్‌ కంపెనీ) వారు దక్కించుకొన్నారు. ఆయన సుమధుర కంఠానికి తెలుగుజాతి నీరాజనం పట్టింది. తెలుగు ప్రజలు పులకించి వారి హృదయకవాటాలు తెరిచి, ఆయనను స్వాగతించి తమ గుండెలలో నింపుకోవడం మొదలెట్టారు. ఘంటసాల ప్రభంజనం తెలుగునాట వీచడం మొదలయింది.

కీ||శే||సముద్రాల రాఘవాచార్య, శ్రీ నాగయ్య గార్ల ఆశీస్సులతో వారు చలనచిత్రరంగ ప్రవేశం చేసి, తనేమిటో, తన సత్తా ఏమిటో రసజ్ఞులకు తెలియచేసి, మరి వెనుతిరిగి చూడలేదు.

సినీరంగంలో ప్రవేశించిన తొలిరోజుల్లో ఆయన పాడిన "చెలియా కనరావా" (బాలరాజు) "పోదువో ప్రియతమా" (లైలా మజ్ఞూ) "అందమే ఆనందం" (బ్రతుకు తెరువు) తెలుగువారిని రసానంద డోలికలలో ఊగించేయి ఆయన కంఠమాధుర్యానికి పరవశింపచేసాయి. ఇప్పటికీ తెలుగువారి గుండెలలో పదిలంగా ఉన్నాయి.

ఇక వారు పాడిన - "నమో వెంకటేశ" వంటి భక్తి గీతాలు, "పుష్పవిలాపం" వంటి పద్యాలు, "పోలిసేంకటసామి" వంటి జానపద గేయాలు - ఒక్కటేమిటి ఆయన స్వరపరచి గానం చేసిన అన్ని ప్రైవేట్‌ గ్రామఫోన్‌ రికార్డులు తెలుగువారు ప్రతి దినం విని ఆ గంధర్వగానానికి ముగ్ధులవుతున్నారు.

అసలు ఆయన గళమే విశిష్టమైనది. ఏ స్థాయిలో పాడినా గంభీరంగా ఉంటూ మాధుర్యానికి మరిన్ని రవ్వలు పొదిగే విలక్షణమైన గళం ఆయనది. త్రిస్థాయిలలోనూ కంఠమాధుర్యాన్ని ఇసుమంతైనా తగ్గని గాయకులు చాలా అరుదు. అందులో ఘంటసాల వారు ప్రథమశ్రేణి లోని వారు. నవరసాలు ఆయన కంఠంలో చాలా అద్భుతంగా ఒదిగిపోయి, పాడిన పాటకు జీవం పోస్తాయి. పాండిత్యం కృషితో రావచ్చు, కానీ, కంఠం సుస్వరం, భగవదత్తం.

ఆయన సంగీతంలో చేయని ప్రక్రియ లేదు - శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం, హరికథలు, బుఱ్ఱకథలు, యక్షగానాలు, భావగెతాలు - ఇలా అన్ని ప్రక్రియలలో ఆయన నిష్ణాతులు. ఆయన తేనెలొలుకు స్వరంతో ఏది గానం చేసినా, అది మరింత మాధుర్యం సంతరించుకొని ప్రతి సంగీత ప్రక్రియకు ఆదర్శంగా నిలుస్తుంది.

పద్యాలు పాడడంలో ఆయన క్రొత్త ఒరవడిని సృష్టించారు. అంత వరకు పద్యాలు ఒక విస్పష్టమైన బాణీలో ఉంటే, వీరు పాడిన కరుణ కరుణశ్రీ పద్యాలు వాటికి విలక్షణంగా ఉండి పద్యాలు పాడడంలో క్రొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సంగీతంలో ఆయనకున్న పట్టు అటువంటిది. ఆయన సుమధుర స్వరామృతవర్షిణిలో తడిసి తన్మయం చెందారు. లలిత సంగీతానికి ఒక ప్రత్యేక స్థానాన్ని, స్థాయిని తెచ్చిన స్వరగంధ్ర్వహేల శ్రీ ఘంటసాల.

నేను చిత్రరంగం ప్రవేశించాక "భూకైలాస్‌" చిత్రంలో ఆయానతో కలిసి యుగళగీతం పాడాను. అదే "ఘంటసాల-సుశీల" యుగళగీతాలకు నాంది. సుమారు రెండున్నర దశాబ్దాలు మేము ఇరువురం పాడిన పాటలు తెలుగు రసజ్ఞులు ఆదరించారు, అభిమానించారు. కన్నతల్లి లాంటి చిత్రపరిశ్రమ ఒడిలో ఊగిన లలితగీతాల ఊయలలు, ఘంటసాల-సుశీల అని తెలుగు ప్రజలు నీరాజనాలందించటం ఒక మధురానుభూతి.

ఆయన గంధర్వగాయకులే కాదు, మంచి స్వరశిల్పి కూడా! ఆయన స్వరపరచిన ఎన్నో గీతాలు కలకాలం గుర్తుంచుకొనేవే, ఆయన స్వరసామ్రాట్‌. "షావుకారు", "పాతాళభైరవి" చిత్రాలకు ఆయన చేసిన మధురగీతాలు, "రహస్యం"లోని యక్షగానం ఆయన చేసిన స్వరకల్పనకు నిలువుటద్దాలు.

ఆయన దక్షిణ, ఉత్తర భాషలన్నింటిలో పదివేలకు పైగా పాడేరు. అందులో ఏవి గొప్పవి అంటే, అన్నీ గొప్పవే! ఆయన పాడిన యుగళగీతాలలో నాతో పాడినవే ఎక్కువ కావడం నా అదృష్టం. మేం ఇద్దరం ఒకే సంగీత కళాశాలలో సంగీతంలో ఓనమాలు దిద్దుకున్నాం - ఒక పరిశ్రమలో అంటే చిత్రపరిశ్రమలో ఒకే వృత్తిని స్వీకరించాం.

ఆయన బహుముఖప్రజ్ఞాశాలి. ఆ మహాగాయకుని గురించి ఎంత వ్రాసిన తక్కువే అవుతుంది.


paTraayani vaariMTa raagarasaadhidEvatanu swarapaarijaataalatO arcana cEsi, vijayanagaraM mahaaraajaa vaari saMgeeta kaLaaSaalalO saptaswaraala tapassu cEsi saanapaTTina vajramai veMDi teraku viccEsina kaLaamatalli muddubiDDa Sree ghaMTasaala. vidyala nagaraM vijayanagaraM. aaMdhradESaaniki apurUpaMgaa aMdiMcina suswara maMdaaramaala sumadhura geetaala hEla Sree ghaMTasaala.

nijajeevitaMlO ennO oDiduDukulanedurkoni saMgeeta saraswatini aaraadhiMci, citraseemalO pravESiMcaDaaniki avakaaSaala kOsaM eMtO SramiMcaaru swaragaMdharvahEla Sree ghaMTasaala. ayitE prakaaSiMcE sUryuDini eMtO kaalaM mabbulu daaci uMcalEvu anna caMdaana vaari pratibhanu gurtiMci, aayana gaLamaadhuryaaniki tanmayaM ceMdi calanacitraraMgaM vaariki saadara swaagataM palikiMdi.

vaari #"#gaalilOnaa bratuku#"# paaTa, #"#nagumOmunaku#"# padyaM vaMTi rasaguLikalu moTTamodaTigaa rikaarDu cEsi aaMdhradEsaaniki aMdiMcina ghanata, keerti hec^.yam^.vi. (graaMphOn^ kaMpenI) vaaru dakkiMcukonnaaru. aayana sumadhura kaMThaaniki telugujaati neeraajanaM paTTiMdi. telugu prajalu pulakiMci vaari hRdayakavaaTaalu terici, aayananu swaagatiMci tama guMDelalO niMpukOvaDaM modaleTTaaru. ghaMTasaala prabhaMjanaM telugunaaTa veecaDaM modalayiMdi.

kee#||#SE#||#samudraala raaghavaacaarya, Sree naagayya gaarla aaSeessulatO vaaru calanacitraraMga pravESaM cEsi, tanEmiTO, tana sattaa EmiTO rasaj~nulaku teliyacEsi, mari venutirigi cUDalEdu.

sinIraMgaMlO pravESiMcina tolirOjullO aayana paaDina #"#celiyaa kanaraavaa#"# (baalaraaju) #"#pOduvO priyatamaa#"# (lailaa majnU) #"#aMdamE aanaMdaM#"# (bratuku teruvu) teluguvaarini rasaanaMda DOlikalalO oogiMcEyi aayana kaMThamaadhuryaaniki paravaSiMpacEsaayi. ippaTikee teluguvaari guMDelalO padilaMgaa unnaayi.

ika vaaru paaDina - #"#namO veMkaTESa#"# vaMTi bhakti geetaalu, #"#pushpavilaapaM#"# vaMTi padyaalu, #"#pOlisEMkaTasaami#"# vaMTi jaanapada gEyaalu - okkaTEmiTi aayana swaraparaci gaanaM cEsina anni praivET^ graamaphOn^ rikaarDulu teluguvaaru prati dinaM vini aa gaMdharvagaanaaniki mugdhulavutunnaaru.

asalu aayana gaLamE viSishTamainadi. E sthaayilO paaDinaa gaMbheeraMgaa uMTU maadhuryaaniki marinni ravvalu podigE vilakshaNamaina gaLaM aayanadi. tristhaayilalOnU kaMThamaadhuryaanni isumaMtainaa taggani gaayakulu caalaa arudu. aMdulO ghaMTasaala vaaru prathamaSrENi lOni vaaru. navarasaalu aayana kaMThaMlO caalaa adbhutaMgaa odigipOyi, paaDina paaTaku jeevaM pOstaayi. paaMDityaM kRshitO raavaccu, kaanee, kaMThaM suswaraM, bhagavadattaM.

aayana saMgeetaMlO cEyani prakriya lEdu - Saastreeya saMgeetaM, lalita saMgeetaM, jaanapada saMgeetaM, harikathalu, bu~r~rakathalu, yakshagaanaalu, bhaavagetaalu - ilaa anni prakriyalalO aayana nishNaatulu. aayana tEneloluku swaraMtO Edi gaanaM cEsinaa, adi mariMta maadhuryaM saMtariMcukoni prati saMgeeta prakriyaku aadarSaMgaa nilustuMdi.

padyaalu paaDaDaMlO aayana krotta oravaDini sRshTiMcaaru. aMta varaku padyaalu oka vispashTamaina baaNeelO uMTE, veeru paaDina karuNa karuNaSree padyaalu vaaTiki vilakshaNaMgaa uMDi padyaalu paaDaDaMlO krotta saMpradaayaaniki SreekaaraM cuTTaaru. saMgeetaMlO aayanakunna paTTu aTuvaMTidi. aayana sumadhura swaraamRtavarshiNilO taDisi tanmayaM ceMdaaru. lalita saMgeetaaniki oka pratyEka sthaanaanni, sthaayini teccina swaragaMdhrvahEla Sree ghaMTasaala.

nEnu citraraMgaM pravESiMcaaka #"#bhUkailaas^#"# citraMlO aayaanatO kalisi yugaLageetaM paaDaanu. adE #"#ghaMTasaala-suSeela#"# yugaLageetaalaku naaMdi. sumaaru reMDunnara daSaabdaalu mEmu iruvuraM paaDina paaTalu telugu rasaj~nulu aadariMcaaru, abhimaaniMcaaru. kannatalli laaMTi citrapariSrama oDilO oogina lalitageetaala ooyalalu, ghaMTasaala-suSeela ani telugu prajalu neeraajanaalaMdiMcaTaM oka madhuraanubhUti.

aayana gaMdharvagaayakulE kaadu, maMci swaraSilpi kooDaa! aayana swaraparacina ennO geetaalu kalakaalaM gurtuMcukonEvE, aayana swarasaamraaT^. #"#shaavukaaru#"#, #"#paataaLabhairavi#"# citraalaku aayana cEsina madhurageetaalu, #"#rahasyaM#"#lOni yakshagaanaM aayana cEsina swarakalpanaku niluvuTaddaalu.

aayana dakshiNa, uttara bhaashalanniMTilO padivElaku paigaa paaDEru. aMdulO Evi goppavi aMTE, annee goppavE! aayana paaDina yugaLageetaalalO naatO paaDinavE ekkuva kaavaDaM naa adRshTaM. mEM iddaraM okE saMgeeta kaLaaSaalalO saMgeetaMlO Onamaalu diddukunnaaM - oka pariSramalO aMTE citrapariSramalO okE vRttini sweekariMcaaM.

aayana bahumukhapraj~naaSaali. aa mahaagaayakuni guriMci eMta vraasina takkuvE avutuMdi.